భారీ చిత్రాలు షూటింగ్ లో ఉండగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీక్ వీరుల నుంచి కాపాడలేకపోతున్నారు. సినిమా లో మెయిన్ ఫుటేజ్ లు బయిటకు వస్తే అంతంత డబ్బు, శ్రమ ఖర్చు పెట్టిన దర్శక,నిర్మాత,నటులుకు ఎంత కష్టం అని ఆలోచించటం లేదు. సినిమాలో క్లిప్ లీక్ అయ్యిందా చూసేసి పండగ చేసుకుందాం అన్నట్లు ఉంటున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి’. దీనికి సీక్వెల్ గా వస్తోంది ‘బాహుబలి 2’. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన రెండు నిముషాల ఇరవై సెకండ్స్ వార్ సీక్వెన్స్ క్లిప్ ఒకటి బయిటకు వచ్చిందని తెలుస్తోంది.
అనుష్క, ప్రభాస్లపై చిత్రీకరించిన ఈ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకుండానే నెట్లో ప్రత్యక్షమైంది. ఇప్పటికే చర్యలు మొదలు పెట్టిన చిత్రయూనిట్ నెట్లో వీడియోను డిలీట్ చేసినా.. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న వారి ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బాహుబలి 2కు సంబంధించిన సన్నివేశాలు లీక్ చేసిన కృష్ణను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమాకు గ్రాఫిక్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న కృష్ణ, విజయవాడలోని 25 మంది ఫ్రెండ్స్కు ఈ సన్నివేశాన్ని లీక్ చేశాడు.
మంగళవారం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవ్వటంతో అలర్ట్ అయిన చిత్రయూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పంధించిన పోలీసులు వీడియోను లీక్ చేసిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈసినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇక బాహుబలి మొదటి పార్ట్‌కు సంబంధించిన 12 నిమిషాల ఫైటింగ్ సీన్ లీకైన సంగతి తెలిసిందే.సినిమా షూటింగు దశలోనే ఈ లీక్ వ్యవహారం వెలుగు చూడటంతో ‘బాహుబలి’ టీం ఆందోళనలో పడింది. వెంటనే రంగలోకి దిగిన టెక్నికల్ టీం ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి క్షణాల్లో తొలగించేశారు.తాజాగా బాహుబలి-2 వీడియో సైతం లీక్ కావటంతో చిత్రయూనిట్ ఆందోళనలో పడింది.