బాక్సాఫీసు రారాజు ‘బాహుబలి 2’

256
Baahubali 2: The Conclusion’ box-office collection
- Advertisement -

ప్ర‌పంచానికి భార‌తీయ సినిమాను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేసిన చిత్రం బాహుబ‌లి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర రంగంలో సాధించని రికార్డులను తనఖాతాలో వేసుకుంటోంది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లోనూ కలుపుకొని సుమారు రూ.860 కోట్లు సాధించింది. మన దేశంలో సుమారు రూ.695 కోట్లు (రూ.545 కోట్లు నెట్‌), విదేశాల్లో రూ.165 కోట్లు వసూలు చేసిందీ చిత్రం.

రెండో వారంలోనూ బాహుబలి బాక్సాఫీసు దాడి కొనసాగుతునే ఉంది. వీకెండ్ కావడంతో ఇప్పటికే రెండు రోజుల పాటు బాహుబలి టికెట్లన్ని బుక్కైపోయాయి. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగానూ సత్తా చాటింది ‘బాహుబలి 2’.  వెయ్యి కోట్ల రూపాయిల క‌లెక్ష‌న్ల మార్క్‌ను ఈ వీకెండ్ ముగిసే స‌మ‌యానికి ట‌చ్ చేయ‌టం ఖాయ‌మంటున్నారు.  అదే జ‌రిగితే.. భార‌త చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెయ్యి కోట్ల రూపాయిల క‌లెక్ష‌న్ల‌ను సాధించిన చిత్రంగా బాహుబ‌లి 2 నిల‌వ‌నుంది.

ఇప్ప‌టికే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ న‌టించిన పీకే రికార్డును బ్రేక్ చేసేసిన బాహుబ‌లి 2.. గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా అత్య‌ధికంగా సాధించిన చిత్రంగా నిలించింది. రానున్న రోజుల్లో బాహుబలి మరెన్ని సంచలనాలకు వేదికగా మారుతాడో వేచిచూడాలి.

- Advertisement -