బాహుబలి 2..సాండ్ ఆర్ట్ వీడియో

274
Baahubali 2: Sand Art Video
- Advertisement -

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కంక్లూజన్’. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ విజువ‌ల్ వండ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 7500 స్క్రీన్ల‌లో ఈ నెల 28న రిలీజ్ అవుతోంది. బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు సాధించి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇటీవలె సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

విడుదలకు ఇంకా 8 రోజుల సమయం ఉండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ టికెట్లు అన్ని అయిపోయినట్లు సమాచారం. అయితే బాహుబలి చిత్రంపై అభిమానులలో ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో ఈ సినిమాపై ప్రేమను చాటుకుంటున్నారు. కొందరు టాటులు వేసుకుంటుంటే మరి కొందరు తమ వెహికిల్స్ పై చిత్ర పోస్టర్ వేయించుకుంటున్నారు. ఇంకొందరు శాండ్ ఆర్ట్ తో వావ్ అనిపిస్తున్నారు.

తాజాగా ముంబైకి చెందిన ఫేమస్ సాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ ఇండియా బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి కి ట్రిబ్యూట్ గా చిత్ర ట్రైలర్ మొత్తాన్ని శాండ్ ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేశాడు. ఈ సాండ్ ఆర్ట్ ట్రైలర్ ప్రతి ఒక్కరిలో విస్మయం అలుముకునేలా చేస్తుంది. మరి ఆ సాండ్ ఆర్ట్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -