సెక్సీ పూనమ్‌కి షాకిచ్చిన గూగుల్

335
Google Bans Poonam's Hot app
- Advertisement -

ఇండియ‌న్ ఫిగ‌ర్ పూన‌మ్ పాండే నిత్యం సంచ‌ల‌న‌మే. ఆమెది నగ్నత్వం కాని నగ్నత్వం. నగ్నత్వపు అంచుల్లో నిలబడి కుర్రాళ్లకు కిక్కెక్కిస్తూ ఉంటుంది.కుర్రాళ్లను ఎలా రెచ్చగొట్టి.. పాపులారిటీ పెంచుకోవాలో పూనమ్ పాండేకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. పూనమ్ కు ముందు.. వెనుక చాలామంది హాట్ బ్యూటీలు వచ్చారు కానీ.. పూనమ్ స్థాయిలో యూట్యూబ్ లో సెగలు రేపుతూ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన వాళ్లు మరొకరు ఉండరు.

‘సెక్సీ యోగా’, ‘నో బ్రా డే’, ‘జంగిల్‌ బూబ్స్‌’ , ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ పేరుతో సంచలన వీడియోలు విడుదల చేసి కుర్రకారు మతి పొగోట్టిన పూనమ్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ బ్యూటీ పూనమ్ పాండే పేరుతో యాప్‌ను విడుదల చేసింది. ఇకనుంచి తన అభిమానులకు యాప్ ద్వారా మరింత చేరువవుతానని తెలిపింది. అయితే,  యాప్‌ను గూగుల్ ఇండియా బ్యాన్ చేసింది. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోకుండా ఆంక్షలు విధించడంతో పాండే మండిపడింది.

Google Bans Poonam's Hot app
తాను గూగుల్‌,యాపిల్‌ స్టోర్స్‌లో  ఎన్నో అడల్ట్ మ్యాగజైన్స్ చూశానని కానీ తన యాప్‌ని మాత్రమే బ్యాన్ చేయడానికి గలకారణాలు తెలియడం లేదని చెప్పింది. యాప్‌ ద్వారా తాను న్యూడ్ ఫోటోలను ప్రదర్శించడం లేదని ఇదే విషయాన్ని  కొంతమంది ఫ్యాన్స్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపింది. అయితే, యాప్ విడుదల చేసిన 15 నిమిషాల్లో 15వేల మంది డౌన్ లోడ్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. గూగుల్ తన యాప్ ని తొలగించినా ఆండ్రాయిడ్ యూజర్లు ది పూనమ్ పాండే యాప్ ని తన వెబ్ సైట్ నుంచి డైరెక్టుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.

గతంలో ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన క్రికెటర్ల కోసం నగ్న ప్రదర్శన చేస్తానని తెగ గొడవచేసింది. చిట్టచివరికి క్రికెటర్ల ముందు కాదు చేయలేదు కానీ నషా అనే చిత్రంలో నగ్నంగా నటించి బీ టౌన్‌ని షేక్ చేసింది.

- Advertisement -