పీకే రికార్డును దాటేసిన బాహుబలి 2..

194
baahubali 2 box office day 6 baahubali 2 beats pk record
- Advertisement -

బాహుబలి ది కన్‌క్లూజన్ మూవీతో టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచి పెట్టుకుపోయాయి. బాహుబలి 2 దెబ్బకు బాలీవుడ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. ఇప్పటి వరకు రూ. 743 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో నెం.1 స్థానంలో ఉన్న ‘పి.కె’ మూవీ బాహుబలి దెబ్బకు రెండో స్థానికి పడిపోయింది. పికె రికార్డు బద్దలవుతుందని అంతా ముందే ఊహించారు. అయితే కేవలం 6 రోజుల్లో బాహుబలి-2 రూ. 785 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ రికార్డుతో ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెం.1 స్థానం దక్కించుకుంది బాహుబలి 2.

ఇండియాలో రూ. 630 కోట్ల గ్రాస్ (రూ. 495 కోట్ల నెట్), ఓవర్సీస్‌లో రూ. 155 కోట్ల గ్రాస్….. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 785 కోట్లు వసూలు చేసిందని ప్రముక ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు. ఇప్పటికే రూ. 800 కోట్లకు చేరువైన ‘బాహుబలి-2′ మూవీ సెకండ్ వీకెండ్‌తో రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -