చైతుకు కారు కొనిచ్చిన సమంత !

168
Samantha Presents 1.5 crore car To Chaitu
Samantha Presents 1.5 crore car To Chaitu
- Advertisement -

నాగ చైతన్య సినిమాల్లోకి రాకముందు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. తన దగ్గరున్న వివిధ మోడ‌ళ్ల కార్లు, బైకులతో చిన్నపాటి గ్యారేజీ మెయింటెయిన్ చేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇపుడు చైతు గ్యారేజీలోకి మరో కారు చేరింది. ఇది మాములు కారు.. కాదు… చైతుకు కాబోయే భార్య సమంత గిఫ్ట్‌గా ఇచ్చిందట. ఏప్రిల్ 28న పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకున్న స‌మంత ఆ సంద‌ర్భంగానే బీఎమ్‌డ‌బ్ల్యూ 7 సిరీస్ లేటెస్ట్ మోడ‌ల్ కార్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందట. ఈ కారు ధ‌ర దాదాపు కోటిన్న‌ర ఉంటుంద‌ట‌. కాబోయే వైఫ్‌ సమంత నుంచి అందుకున్నఈ కారుతో మురిసిపోతున్నాడ‌ట‌ చైతూ. నాగ చైతన్య, సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు నిశ్చితార్థం అయింది కాబట్టి సగం పెళ్లి అయినట్లే. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఎవరి సినిమాల్లో వారి బిజీగా ఉంటూనే ఇద్దరికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్, పార్టీల్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -