యోగా దినోత్సవంలో పాల్గొన్న బీ వినోద్ కుమార్

244
b vinod kumar
- Advertisement -

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తన పెద్ద కుమారుడు డాక్టర్ ప్రతీక్‌తో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోని అధికార నివాసంలో యోగా చేశారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాత్రమే యోగా చేయడం లేదని, ప్రతి రోజు యోగా చేయడం తనకు అలవాటు అని వినోద్ కుమార్ తెలిపారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు ప్రతి రోజు యోగా చేస్తారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వినోద్ కుమార్ అన్నారు.

- Advertisement -