- Advertisement -
కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో పత్తి విత్తనాలు పెడుతున్న కూలీలను చూసి కార్ అపి రైతులతో,కూలీలతో వినోద్ కుమార్ ముచ్చటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేస్తున్నారా అని అడగారు. రైతులు ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే పంటలు వేస్తున్నామని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే పంటలు వేయడం లాభదాయకమని రైతులు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా పంటలు వేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని లాభాలు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఒకే రకమైన పంటను వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని వారి చెప్పింది నిజమే అని రైతులు అన్నారు.వరి పంట ఒకటే కాకుండా పత్తి, పెసర, కూరగాయ పంటలు, కంది సాగు చేస్తున్నామని తెలిపారు. వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
- Advertisement -