ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వైశాఖం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి మాట్లాడుతూ -“నేను ప్రారంభం నుండి న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను. మా వైశాఖం సినిమాకు వాలిశెట్టి వెంకటసుబ్బారావు సినిమాటోగ్రఫీ అందిస్తే, డిజె.వసంత్ మ్యూజిక్ అందించారు. వాలిశెట్టి వెంకటసుబ్బారావుతో కలిసి పద్నాలుగేళ్ళ క్రితమే చంటిగాడు సినిమా కోసం ఓ డిజిటల్ సాంగ్‌ను చేశాం. ఆ సాంగ్‌ను చూసిన రామోజీరావు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఎంతో అభినందించారు. ఈ టెక్నాలజీ డెవలప్ అయితే పదేళ్ళకు ల్యాబ్స్ ఉండవనీ అన్నారు. ఆయన అన్నమాట ఈరోజు నిజమైంది. సుబ్బారావు సినిమాటోగ్రఫీతో పాటు డిఐ కూడా ఆయనే చేస్తారు. ఎక్విప్ మెంట్‌ను ఆయనే డిజైన్ చేసి ఆపరేట్ చేసుకుంటారు. ఈ సినిమా కోసం బాడీ గింబల్ అనే కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సాధారణంగా స్టడీ కెమెరాలో షేకింగ్ అయితే పిక్చరైజేషన్ ఇబ్బందిగా ఉంటుంది. కానీ బాడీ గింబల్ టెక్నాలజీలో షేకింగ్ ఉన్నా కూడా ఏ సమస్య ఉండదు. ఈ టెక్నాలజీని ఇప్పుడు శంకర్ 2.0 సినిమాకు ఉపయోగిస్తున్నారని తెలిసింది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావు మాట్లాడుతూ – “దేవుడు ఇచ్చిన మేథస్సు కంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఇచ్చే వ్యక్తులు చాలా ముఖ్యం. వారే నాకు గొప్ప. అటువంటి వ్యక్తులైన నిర్మాత బి.ఎ.రాజు, డైరెక్టర్ జయకి కృతజ్ఞతలు. చంటిగాడు సమయంలో నేను జయగారిని కలిసి డిజిటల్ టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు ఆమె ఎంతో ఎంకరేజ్ చేశారు. ఓ సోని కెమెరాతో సాంగ్ చిత్రీకరించి డిజిటల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాం. అప్పటికే చంటిగాడు సినిమా రిలీజై నాలుగు వారాలవుతుంది. అయిన ఆవిడ నాపై నమ్మకంతో అప్పట్లోనే డిజిటల్ టెక్నాలజీతోసాంగ్ షూట్ చేశారు. నేను రెబోటిక్స్ శాస్త్రవేత్తను కూడా నాపై నమ్మకంతో హవీష్, కె.ఎల్.యూనివర్సిటీ అధినేత కె.ఎల్.సత్యనారాయణ నాకు ప్రొఫెసర్‌గా అవకాశం కల్పించారు. ఇక వైశాఖం సినిమా విషయానికి వస్తే గింబల్ టెక్నాలజీ అనే కాదు, చాలా కొత్త విషయాలను తయారు చేశాం. కానీ వాడటానికి వీలు కలుగలేదు. ప్రేక్షకుడు సినిమా చూస్తుంటే మూమెంట్, కలర్ సెన్స్, యాంగిల్ ఆఫ్ వ్యూ ను పీలవుతుతాడు. గింబల్ టెక్నాలజీని వాడాలనుకున్నప్పుడు అప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది.
అయిన నిర్మాత బి.ఎ.రాజు, దర్శకురాలు జయ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు. వాటి రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని థియేటర్స్‌కు వెళ్లినప్పుడు ఆడియెన్స్ పాటలు వినగానే కేరింతలు కొడుతున్నారు. అలాగే పూరి జగన్నాథ్, దేవిశ్రీ ప్రసాద్ సహా పాటలను చూసిన వాళ్ళందరూ చాలా బావున్నాయని అప్రిసియేట్ చేస్తున్నారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఫారిన్ లోకేషన్స్‌కు వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడైనా కొత్త ప్రదేశానికి వెళితే బావుంటుందని అనుకున్నప్పుడు జయగ, బి.ఎ.రాజు ఎవరూ వెళ్ళని చోటికి వెళ్ళి సాంగ్స్ షూట్ చేద్దామని అని ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఇప్పటి వరకు ఎవరూ షూటింగ్ చేయని కజికిస్థాన్‌లో సాంగ్స్‌ను షూట్ చేశారు. రాజు, జయ వంటి టెక్నిషియన్స్ దొరికితేనే మా వంటి టెక్నిషియన్స్‌కు మంచి గుర్తింపు ఉంటుంది. డైరక్టర్ జయకి చాలా ఓపిక. సినిమా అవుట్‌పుట్ అనుకున్న విధంగా వచ్చే వరకు కాంప్రమైజ్ కారు, తనకు కావాల్సిన దాన్ని చక్కగా రాబట్టుకుంటారు. రెండున్నర, మూడేళ్ళ ప్లానింగే వల్ల సినిమా చక్కగా వచ్చింది“ అన్నారు.