సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి

4
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మంత్రి పదవి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, తుది తీర్పుపై ఆధారపడి ఆయన మంత్రి పదవి కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న ఉత్కంఠగా మారింది.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అమీర్ అలీ ఖాన్, ప్రొఫెసర్ కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, ఆ నామినేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును చేర్చి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి నివేదికను పంపినట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించిన కాంగ్రెస్, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోపు తప్పనిసరిగా ఏదో ఒక ప్రజాప్రతినిధి పదవికి—ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ—ఎన్నిక కావాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేనిపక్షంలో ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది.

అయితే వచ్చే ఏడాది నవంబర్ వరకు ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అయ్యే అవకాశం లేకపోవడంతో, అజారుద్దీన్ ఎన్నిక కావడం సాధ్యమా? ఆయన మంత్రి పదవి కొనసాగుతుందా లేదా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read:వైభవ్‌పై భారత మాజీ క్రికెటర్ ప్రశంసలు

- Advertisement -