మాజీ భారత క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్… 14 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత అండర్-19 జట్టుకు, అలాగే దేశవాళీ క్రికెట్‌లో ఇటీవలి కాలంలో వైభవ్ చూపుతున్న ప్రదర్శన అద్భుతమని పేర్కొంటూ, అతను త్వరలోనే సీనియర్ భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో వైభవ్ సూర్యవంశీ తన ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తరఫున మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడిన అనంతరం, విజయ్ హజారే ట్రోఫీ 2025–26 తొలి రౌండ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై బిహార్ తరఫున 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ భారీ ఇన్నింగ్స్ బిహార్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించింది.
ఈ ప్రదర్శనపై స్పందించిన శ్రీకాంత్…వైభవ్ ఎక్కడ ఆడినా సెంచరీలు చేస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ అయినా, అండర్-19 అయినా, ఎక్కడైనా రాణిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై చేశాడని కొందరు అనవచ్చు, కానీ ఈ కుర్రాడు అందరి మీద ఆధిపత్యం చూపిస్తున్నాడు. అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. సచిన్ టెండూల్కర్‌లా అతనిని వేగంగా భారత జట్టులోకి తీసుకురావాలి అన్నారు.
అలాగే, వైభవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా సెలెక్టర్లు తప్పక గుర్తిస్తారని శ్రీకాంత్ అన్నారు. అతని రికార్డులు చూడండి, అతను పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నాడు. కనీసం రిజర్వ్ ప్లేయర్‌గా అయినా అవకాశమివ్వాలి. ఇలాంటి అసాధారణ ప్రతిభను వదిలిపెట్టకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
Also Read:Rewind 2025:ఈ ఏడాది చనిపోయిన ప్రముఖులు వీరే!

