Ram Mandir:అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలివే

25
- Advertisement -

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఈ నెల 22న అంకురార్పణ జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వెళ్లి రామ మందిరం చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది ప్రజలు. ఇక అయోధ్యకు వెళ్తే రామమందిరంతో పాటు చూడదగ్గ ప్రదేశాలివే.

అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న ఘాట్​లను మీరు సందర్శించవచ్చు. ఆ నదిలో మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. తులసి ఉద్యాన వనంను దర్శించుకునే అవకాశం ఉంది. కనక భవన్​లో జరిగే హారతిని అస్సలు మిస్ కావొద్దు. బంగారం, వెండితో నిర్మించిన ఈ దేవాలయంలో హారతి సమయం అద్భుతంగా ఉంటుంది. అయోధ్యలో స్థానిక రుచులు బెడ్మీ పూరీ, ఛత్, వెజ్ బిర్యానీ, కచోరీ సబ్జీ, బాతీ చోఖా వంటి వంటకాలను ఖచ్చితంగా రుచిచూడాల్సిందే.

రామాలయం, హనుమాన్ గర్హి మందరిం, కనక భవన ఆలయం, నాగేశ్వరనాథ్ ఆలయం, మణి పర్వతం, సీతా కీ రసోయి, త్రేతా కే ఠాకూర్​ను చూడవచ్చు. యాత్రికులు రామాలయాన్ని సందర్శించుకోవాలనుకుంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధికారిక వెబ్​సైట్​ చెక్ చేసుకోవచ్చు.

Also Read:KTR:బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాపక్షమే

- Advertisement -