సీఎం రేవంత్‌ని కలిసిన అయోధ్య రెడ్డి

50
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వోగా బి. అయోధ్య రెడ్డిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు అయోధ్య రెడ్డి. సీఎంకు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సి.ఎం. కార్యాలయంలో సీపీఆర్ఓ గా నియమించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన అయోధ్య రెడ్డి సుదీర్ఘకాలంగా మీడియాలో పనిచేశారు. ప్రజాశక్తి,ఆంధ్రజ్యోతి, సాక్షి దిన పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియమితులైన దగ్గరి నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

Also Read:పిక్ టాక్ : ఆ అందాలతో సోకుల విందు

- Advertisement -