అయోధ్య రామాలంయం కోసం రూ.1800కోట్ల ఖర్చు

79
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం రూ.1800 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధికారులు అంచ‌నా వేశారు. ఈ రామాలయం నిర్మాణం కోసం ప్రభుత్వంనుంచి గానీ, విదేశాల నుంచి గానీ ఏవిధంగానైన దనంను తీసుకోవడంలేదని తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తెలిపారు. ఈ నిర్మాణం కోసం భారత ప్రజల నుంచి చందాల రూపంలో వసూలు చేసినట్టుగా తెలిపారు.

ప్ర‌ఖ్యాత హిందూ మ‌త సాధువుల విగ్ర‌హాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని ఫైజాబాద్ స‌ర్క్యూట్ హౌజ్‌లో జ‌రిగిన మీటింగ్‌లో తీర్మానించారు. అయితే నిపుణులు ఇచ్చిన నివేదిక ప్ర‌కారం .. కేవ‌లం రామాల‌య నిర్మాణం కోసం 1800 కోట్లు అవుతుంద‌ని ట్ర‌స్టు తెలిపింది. ట్ర‌స్టుకు సంబంధించిన రూల్స్‌ను ఫ్రేమ్ చేసిన‌ట్లు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. రామాయ‌ణ కాలం నాటి ప్ర‌ధాన క్యారెక్ట‌ర్ల‌కు చెందిన విగ్ర‌హాల‌ను కూడా ఆల‌య కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే రామాలయంను డిసెంబ‌ర్ 2023 నాటికి పూర్తి అవుతుంద‌ని అధికారులు తెలిపారు.

- Advertisement -