- Advertisement -
రెండు రోజుల పాటు అయోధ్య బాలరాముడి దర్శనం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నవంబర్ 24న సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు రామ్ లల్లా దర్శనం ఉండదని ప్రకటించారు.
నవంబర్ 26న ఉదయం 7 గంటలకు దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25న అయోధ్య రామ మందిరం శిఖరాగ్రంలో జరగనున్న ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరు కానున్నారు ప్రధాని మోదీ.
ఈ క్రమంలోనే 24, 25 తేదీల్లో రామయ్య దర్శనానికి బ్రేక్ వేశామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.
Also Red:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!
- Advertisement -

