- Advertisement -
సాధారణ భక్తులకు దర్శనమిస్తున్నారు బాలరాముడు. నిన్న అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగగా నేటి నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు బాలరాముడు. ఇక ఉదయం నుండే బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
24 అడుగుల దూరం నుంచి బాలరాముని దర్శనం చేసుకోవచ్చు. దర్శన సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు. ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శన భాగ్యం ఉంటుంది.
బాలరాముడికి ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.
Also Read:TTD:తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు
- Advertisement -