వివాహ పంచమి సందర్భంగా భగవాన్ శ్రీరామ్–మాతా సీతల దివ్య కల్యాణ ఉత్సవంతో అయోధ్య ధగధగలాడుతోంది. ఇదే సమయంలో శ్రీ రామ జన్మభూమి మందిరంలో చారిత్రాత్మక ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా సాగాయి. ఈ రోజు ఉదయం అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజారోహణ కార్యక్రమం, సనాతన హిందూ సంప్రదాయంలో ధర్మం అథర్మంపై సాధించిన విజయానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.
ఈ కాషాయ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో కూడిన కుడి కోణం ఉన్న త్రిభుజాకార పతాకం. ఇందులో భగవాన్ శ్రీరామ్ తేజస్సును, శౌర్యాన్ని సూచించే సూర్యుడు, పవిత్ర కోవిదార వృక్షం, మరియు ఓం గుర్తులు ఉంటాయి. పారా షూట్ ఫాబ్రిక్‌తో, పట్టు నూలుతో రూపొందించిన ఈ పతాకం గౌరవం, ఐక్యత, సాంస్కృతిక పరంపర, మరియు రామరాజ్యం సిద్ధాంతాలను ప్రతిబింబిస్తుంది. ఈ జెండా ఆలయ 161 అడుగుల శిఖరంపై అమర్చిన 42 అడుగుల జెండా స్థంభంపై ఎగురవేశారు. వాల్మీకి రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రేరణతో రూపొందించిన ఈ త్రిభుజాకార పతాకం దైవత్వం, బలం, మరియు శ్రీరామ్ నిత్య చైతన్యాన్ని సూచిస్తుంది.
ప్రధాని మొదట సప్త మందిర్‌లో ప్రార్థనలు చేసి, తర్వాత శేషావతార్ మందిర్ మరియు మాతా అన్నపూర్ణ మందిర్‌ని సందర్శించారు. తర్వాత రాం దర్వార్ గర్భగృహంలో పూజలు నిర్వహించి, ఆలయ శిఖరంపై కాషాయా పతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read:Delhi AQI:తీవ్రస్థాయికి గాలి నాణ్యత

