సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘ట్వీట్స్‌ 2కె రన్‌’

400
2k run
- Advertisement -

సీఎం కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో ట్వీట్స్ 2కె రన్‌ నిర్వహిస్తున్నట్లు గొసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రవీంద్రభారతిల నుండి లలితకళాతోరణం వరకు 2కె రన్ జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ రానున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ద్వారా అమెరికా లో కేవలం 2500 మంది తో , చైనా లో 3000 మంది తో నిర్వహించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొట్టమొదటి సారి మన తెలంగాణ రాష్ట్రం లో 5000 మంది తో ” ట్వీన్స్ 2కె రన్ ” నిర్వహిస్తూ , 66 కిలోల కేక్ ను కట్ చేస్తూ , కేసీఆర్ అనే అక్షరాలు వచ్చే విధంగా మానవ హరం చేపడతామని , దీనితో పాటు 666 కేసీఆర్ గారి పేరుతో హిలియం బెలూన్స్ ను కవలలు గాలిలోకి వదులుతారని తెలిపారు.

హైదరాబాద్ మొట్ట మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే కవలలు ఎవరైనా ఉంటే 9121066647 , 9121366642 నెంబర్ లను సంప్రదించాలని సేవ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గొసుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

- Advertisement -