కంటతడి పెట్టిన నాని…

378
Awe Theatrical Trailer
- Advertisement -

వాల్‌పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై నాని స‌మ‌ర్పిస్తున్న సినిమా ‘అ!’. నిత్యా మీన‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు.

చిన్నపాప వాయిస్ ఓవర్‌లో ప్రారంభమై ఈ ట్రైలర్‌లో ‘నా డైరీలో లాస్ట్‌ ఎంట్రీ. ఈ రోజు నేనో మాస్‌ మర్డర్‌ చేయబోతున్నా అనే డైలాగ్ వినిపిస్తుంటే.. ఇంతలో వరుసగా పాత్రధారులను రివీల్ చేశారు. చేపలకు కూడా క‌న్నీళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా.. కనపడవంతే! నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే ఈ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

- Advertisement -