రివ్యూ: అ!

392
Awe Movie Review
- Advertisement -

హీరోగా వరుస విజయాలను అందుకుంటూ.. యంగ్ హీరోలలో టాప్ హీరోగా దూసుకుపోతున్న నాని.. ఇప్పుడు నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘అ!’. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..?నిర్మాతగా నాని రాణించాడా లేదా చూద్దాం..

కథ :

ఓ రెస్టారెంట్‌లో కలి (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) ఎంట్రీతో సినిమా మొద‌ల‌వుతుంది. అదే రెస్టారెంట్‌లో రాధ‌(ఈషారెబ్బా) త‌న త‌ల్లి (రోహిణి), తండ్రితో క‌లిసి ప్రియుడి కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆమె త‌ల్లిదండ్రులు త‌మ అమ్మాయి మంచి ఆస్థిప‌రుడుని చూసి ప్రేమించింద‌ని అనుకుంటారు. కానీ తీరా కృష్ణ‌వేణి(నిత్యామీన‌న్‌)ని ప‌రిచ‌యం చేసి తాము పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంది. అదే హోట్‌లో చెఫ్ ఉద్యోగానికి వ‌స్తాడు నాలా (ప్రియ‌ద‌ర్శి). నిజానికి నాలాకు వంట రాదు. ఎక్వేరియంలో చేప‌(నాని వాయిస్ ఓవ‌ర్‌లో) మాట్లాడే మాట‌లు.. అదే రూమ్‌లో ఓ చెట్టు (ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్‌) సాయంతో నాలా వంటచేస్తుంటాడు. ఆ హోటల్‌కి ఫేమ‌స్ మేజిషియ‌న్ యోగి(ముర‌ళీశ‌ర్మ‌) వ‌చ్చి..తాను గొప్ప మేజిషియ‌న్ అని గ‌ర్వంగా చెబుతాడు. కానీ రెస్టారెంట్ య‌జ‌మాని(ప్ర‌గ‌తి) కూతురు(చిన్న‌పాప‌) ఒప్పుకోదు. వీరి క‌థలు ఇలా సాగుతుండ‌గా.. అదే హోటల్‌లో ప‌నిచేసే మీరా (రెజీనా) ఓ పార్టీని మోసం చేసి డ‌బ్బులు కాజేయాల‌ని అనుకుంటూ ఉంటుంది. మ‌రోవైపు సైంటిస్ట్ అయిన శివ‌(అవ‌స‌రాల శ్రీనివాస్‌) టైంమిష‌న్ క‌నిపెట్టి చిన్న‌త‌నంలో తప్పిపోయిన త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌లుసుకోవాల‌నుకుంటుంటాడు. మ‌రి ఇన్ని క్యారెక్ట‌ర్స్‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు క‌లి ఆందోళ‌న‌గా ఎందుకు ఉంటుంది? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Awe Movie Review
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, నటీనటులు,సినిమాటోగ్రఫీ. కాజల్,నిత్యా,రెజినా,ఇషా రెబ్బా,శ్రీనివాస్ అవసరాల నటనకు వంక పెట్టలేం. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన కాజ‌ల్, రెజీనాల‌తో పాటు ఈషా రెబ్బా, నిత్యా మీన‌న్ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.. అవ‌స‌రాల‌, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీ శ‌ర్మ‌లు సినిమాను నిల‌బెట్టారు. తమ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా హోటల్‌లో జరిగే సీన్స్ సినిమాకు మరో మెట్టుకు తీసుకెళ్లాయి. నాని అండ్ రవి తేజా వాయిస్ ఈ సినిమా కి ప్రాణం పోశాయి. ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, సెకండ్ హాఫ్‌,క్లైమాక్స్ తో కట్టిపడేశాడు.

మైనస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ పాత్రలు ఎక్కువైపోవడం,సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాని కాన్సెప్ట్. పాత్ర‌లు మ‌రీ ఎక్కువైపోవ‌డంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. అలాగే చివ‌రికి వ‌చ్చేస‌రికి ఈ గంద‌ర‌గోళం త‌గ్గ‌క‌పోగా .. ఎక్కువైపోయింది. థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన చాలా మంది ప్రేక్ష‌కులకు పాత్ర‌లు వాటి తీరు తెన్నులు చాలా వ‌ర‌కు అర్థం కాలేదు.

సాంకేతికవిభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. నాని నిర్మాణ విలువలకు వంకపెట్టలేం. డిఫరెంట్ కథను దర్శకుడు ప్రశాంత్ చక్కగా డీల్ చేశాడు. అస‌లు క‌థే నూత‌న‌త్వం అనుకుంటూ ఇక తీసే విధానంలో మ‌రింత కొత్త‌గా తీశాడు ప్ర‌శాంత్. ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన త‌పన , శ్ర‌మ అంతా స్రీన్ పై క‌నిపిస్తుంది..మార్క్ రొబిన్ సంగీతం బాగుంది. కార్తీక్ ఛాయగ్రహణం బాగుంది. పంచ్ డైలాగ్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకే హైలైట్. ఎడిటింగ్ బాగుంది.

Awe Movie Review

తీర్పు:

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్మాతగా టాలీవుడ్‌లో నాని చేసిన సరికొత్త ప్రయోగం అ!. వినూత్నమైన కథను డీల్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ సక్సెస్ కాగా నాని,రవితేజ వాయిస్ ఓవర్, నటీనటుల యాక్టింగ్‌ సినిమాకు ప్లస్ పాయింట్స్‌ . ఓవరాల్‌గా కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ మూవీ…అ!.

విడుదల తేదీ:16/02/2018
రేటింగ్:2.5/5
నటీనటులు:కాజల్ అగర్వాల్, అవసరాల శ్రీనివాస్ , రెజీనా కాసాండ్రా , నిత్యా మీనన్ , ఇషా రెబ్బా
సంగీతం : మార్క్ . కె . రాబిన్స్
నిర్మాత : నాని
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

- Advertisement -