వర్షాకాలంలో కాలంలో ఎన్నో రకాల వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వైరస్ లు, బ్యాక్టీరియా వంటివి పెరగడం అవి మన శరీరంపై ప్రభావం చూపడంతో రకరకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు చుట్టూ ముడుతుంటాయి. ముఖ్యంగా ఫ్లూ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ప్రధానంగా వేదిస్తుంటాయి. వీటితో పాటు వర్షాకాలంలో కండ్లకలక వ్యాధి కూడా ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా ఈ వర్షాకాలంలోనే ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు అవుతుంటాయి. ప్రస్తుతం మన దేశంలో డిల్లీ, ముంబై వంటి ప్రాంతాలలో కండ్లకలక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ వ్యాధి ఎలా ఏర్పడుతుంది ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.!
కండ్లకలక ఒక అంటూ వ్యాధి.. ఇది ఇంట్లో ఒకరికి వస్తే మొత్తం ఇంటిసభ్యులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో కండ్లు ఎర్రబడడం, కళ్ల నుంచి ఎక్కువగా నీరు కారుతుండడం, కళ్ళలో ఇసుక పోసినట్లుగా గరుకుగా ఉండడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా కండ్ల కలక వచ్చిన వారికి కంటిఊసులు తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే రాత్రి పడుకున్న తరువాత కళ్ళు తెరవడానికి కూడా వీలు లేకుండా ఊసులతో కంటి రెప్పలు అతుక్కుపోతాయి.
Also Read:KTR:33 శాతానికి పెరిగిన గ్రీనరీ
ఈ కండ్లకలక అనేది సాధారణ వ్యాదే అయినప్పటికి.. దీని పట్ల నిర్లక్ష్యం వద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి చాలమంది సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. కంటికి సంబంధించిన డ్రాప్స్ వేసుకోవడం, అయింట్ మెంట్ వంటివి వాడడం వంటివి చేస్తుంటారు. కానీ వైద్యుడి సలహా మేరకు తగిన మెడిసన్స్ వాడడం వంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కండ్ల కలక రాకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కండ్లకలక వచ్చిన వారు ఇది అంటూ వ్యాధి కాబట్టి ఇతరులకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కళ్ళకు కళ్ళజోడు ( బ్లాక్ ) ధరించడం మంచిది. కళ్ళకు తీవ్ర స్థాయిలో ఊసులు ఇబ్బంది పెడుతుంటే ఎప్పటికప్పుడు గోరు వెచ్చని నీటితో కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంకా వైద్యుడి సలహా మేరకు తగిన మెడిసన్స్ వాడుతూ ఉండాలి. ఈ సూచనలు జాగ్రతలు పాటిస్తే కండ్లకలక నుంచి త్వరగా బయట పడవచ్చు.
Also Read:ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచే చిట్కాలు!