ఫుడ్ పాయిజన్ తగ్గించే చిట్కాలు..

19
- Advertisement -

వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తినే ఆహారం కలుషితంగా మారితే పుడ్ పాయిజన్ గా పరిగణిస్తారు నిపుణులు. వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా వంటివాటి వృద్ది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు బయట బండ్లపై ఉండే ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వర్షాల కారణంగా రోడ్లపై లేదా రోడు పక్కన నీరు నిల్వ ఉండడం సహజం. ఇలా నిల్వ ఉన్న నీటిపై దోమలు, బ్యాక్టీరియా వంటివి వృద్ది చెందుతాయి. ఇవి తినే ఆహారంపై వాలినప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది..

ఇంకా ఇళ్ళలో కూడా ఆహారాన్ని అలాగే నిల్వ ఉంచడం లేదా కలుషిత నీటిని తాగడం చేత కూడా ఫుజ్ పాయిజన్ కు గురి అవుతుంటాము. ఇలా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు వాంతులు, విరోచనలు కలుగుతాయి, ఇంకా తలనొప్పి కడుపులో వికారం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఈ ఫుడ్ పాయిజన్ అత్యంత ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ మాత్రం నిర్లక్షం చేయకుందా వెంటనే వైద్యుడిని సంప్రదించి మెడిసన్స్ తీసుకోవడం ఉత్తమం.

అయితే ఫుడ్ పాయిజన్ వల్ల కలిగే సమస్యలు కొద్దిగా ఉన్నప్పుడూ కొన్ని చిట్కాల ద్వారా వాటి నుంచి బయట పడవచ్చు. వాంతులు మరియు వికారం అనిపించినప్పుడు ఒక స్పూన్ తేనెను మూడు పూటలా తీసుకుంటే వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ఇక విరోచనలు ఉన్నప్పుడూ రెండు అరటి పండ్లను పేస్ట్ లా తయారు చేసుకొని పాలతో కలిపి తీసుకుంటే విరోచనలు తగ్గుతాయి. నీరసంగా ఉన్నప్పుడూ అరటిపండు తినాలి. ఇంకా పెరుగులో కొద్దిగా చక్కెర వేసుకొని తింటే విరోచనల శరీరానికి శక్తి లభిస్తుంది. పెరుగు యాంటీ బయోటిక్ లా పని చేస్తుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ ద్వారా వచ్చే సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.

Also Read:రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

- Advertisement -