పిలువని పేరాంటాన్ని వెళ్లి అవమానపడేకన్నా దూరంగా ఉండటం మేలని చాలా మంది ఆలోచిస్తూంటారు. కానీ ఒక వింత సంఘటన మాత్రం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన విద్యార్థి నేరుగా వరుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వరుడితో కొన్ని సెల్ఫీలు దిగాడు. ఓ వివాహ వేడుకకు వెళ్లిన విద్యార్థి.. నేరుగా వరుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ వరుడితో కొన్ని సెల్ఫీలు దిగాడు. అనంతరం ఆ పెళ్లికొడుకుతో నాకు మీ పేరు కూడా తెలియదు.. ఫ్రీ ఫుడ్ తినడానికి పెళ్ళికి వచ్చానని చెప్పాడు. వైరల్ అవుతున్న క్లిప్‌లో.. విద్యార్థి.. పెళ్లికొడుకుతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. నేను హాస్టల్‌లో నివసిస్తున్నాను. ఆహారం వండలేదు. నాకు ఆకలిగా ఉంది.. కనుక నేను మీ పెళ్ళికి తినడానికి వచ్చాను. మీకేమైనా సమస్య ఉందా?’ అని అడిగాడు.
సదరు స్టూడెంట్ నిజాయితీని చూసి పెళ్లికొడుకు నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పాడు. అంతేకాదు పెళ్ళికొడుకు ఇంకా మాట్లాడుతూ.. మీకు కావాలంటే మీ హాస్టల్‌కి కూడా కొంచెం ఫుడ్ ప్యాక్ చేయించి తీసుకుని వెళ్ళండని సూచించాడు. ఈ చిన్న క్లిప్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ వీడియోను ఐఏఎస్ అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే క్యాప్షన్ కూడా ఈ వీడియోకి జత చేశారు. ఈ 45 సెకన్ల క్లిప్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. వీడియోను 1.3లక్షలకు పైగా వీక్షించగా, 10 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
God Bless You.
pic.twitter.com/0Cu0rDdZoI
— Awanish Sharan (@AwanishSharan) December 1, 2022
ఇవి కూడా చదవండి…