MODI:అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు: మోదీ

37
- Advertisement -

దేశంలో ఏదైనా కేసు పరిష్కారం కాకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని డిమాండ్ వినిపించేంతగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. న్యాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిందన్నారు. ఢిల్లీలోని సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. కేసు పరిష్కారం కాకపోతే దానిని సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ నిరంతరం వినిపిస్తుందని అన్నారు. సమర్థవంతమైన సంస్థలు లేకుండా అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు.

అవినీతి అనేది ప్రజాస్వామ్యం న్యాయవ్యవస్థకు అతిపెద్ద అవరోధంగా మారిందని అవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి నుంచి భారత్‌ను విముక్తి చేయడం ఈ సంస్థ ముందున్న అతిపెద్ద బాధ్యత అని గుర్తు చేశారు. ఒక దశాబ్దం క్రితం అవినీతికి పాల్పడేందుకు పోటీ ఉండేదని…ఆ సమయంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగాయని అన్నారు. అయితే మా ప్రభుత్వం మాత్రం నల్లధనం బినామీ ఆస్తులపై యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని అన్నారు. కొంతమంది ఏళ్ల తరబడి ఈవ్యవస్థలో ఉన్నారని కానీ మీరు మీ పనిపై మాత్రమే దృష్టిపెట్టండని సూచించారు. అవినీతి పరుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..

KTR:నయా కూల్ రూఫ్ పాలసీ:కేటీఆర్‌

దేశానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష..

- Advertisement -