- Advertisement -
ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆస్ట్రేలియా ప్రధానిపై దాడికి పాల్పడింది ఓ మహిళ. ఆస్ట్రేలియా లో జరిగే సాధారణ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని స్కాట్ మారిసన్ పై గుడ్డుతో దాడికి పాల్పడ్డారు. కెనబెరా సమీపంలోని అల్బురీలో మహిళా సంఘం సమావేశంలో ఈఘటన చోటుచేసుకుంది. మహిళలతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని వెనుక నుంచి వచ్చి ఓ మహిళ గుడ్డుతో దాడి చేసింది. ప్రధానిపై దాడికి పాల్పడ్డ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో మే18న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.
- Advertisement -