క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ ఇకలేరు..

145
warne shane
- Advertisement -

క్రికెట్ లెజెండ్,ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్ వార్న్‌(52) ఇక లేరు. ఇవాళ థాయ్​లాండ్​లో గుండెపోటుతో కన్నుమూశారు. వార్న్ మృతితో క్రీడా ప్రపంచం షాక్​కు గురైంది. ఒంటిచెత్తో ఆసీస్‌ను విజయాల బాట పట్టించిన వార్న్‌ లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

తన నివాసంలో వార్న్ విగతజీవిగా పడిఉండటాన్ని చూసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

145 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీసుకున్నారు. ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఒక మ్యాచ్ లో 12 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. 194 వన్డేలు ఆడి.. 293 వికెట్లు పడగొట్టారు. షేన్​వార్న్​ టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి రేర్ రికార్డు క్రియేట్ చేశారు. ఐపీఎల్​లో 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించాడు.

- Advertisement -