దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించారు…

199
Australia wrap up first Test ...
- Advertisement -

డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టుని 118 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడించింది. నాలుగో రోజే 9 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువలో ఉన్న సఫారీలు.. చివరి రోజు తొలి సెషన్‌లోనే తలవంచారు. 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 298 పరుగులకే ఆలౌటైంది. 9 వికెట్ల‌కు 293 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుతో చివ‌రి రోజు చేజింగ్ మొద‌లుపెట్టిన సౌతాఫ్రికా కేవ‌లం 5 ప‌రుగులే జోడించ‌గ‌లిగింది.

ఓపెనర్ మర్‌క్రామ్ (143), డీకాక్ (83) పోరాడినా ఫలితం లేకపోయింది. 118 పరుగులతో గెలిచిన ఆసీస్.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ 4, హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 351, రెండో ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ కావడం సౌతాఫ్రికా కొంప ముంచింది.

మ్యాచ్‌లో 9 వికెట్లు తీసుకున్న మిచెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వార్నర్, డీకాక్ మధ్య జరిగిన మాటల యుద్ధంపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది.

- Advertisement -