మెల్‌బోర్న్ టెస్టు..నిలకడగా ఆడుతున్న భారత్

234
kohli
- Advertisement -

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జట్టుకు కీలకసమస్యగా మారిన ఓపెనింగ్ జోడి లోకేష్ రాహుల్,శిఖర్‌ ధావన్‌లకు ఉద్వాసన పలికిన జట్టు యాజమాన్యం మయాంక్ అగర్వాల్,రోహిత్ శర్మలకు తుదిజట్టులో స్ధానం కల్పించింది.

తొలి టెస్టు ఆడుతున్న మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో మ్యాజిక్ చేశాడు. 76 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు మయాంక్‌. 55వ ఓవర్లో కమిన్స్‌ వేసిన బంతిని టిమ్‌పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న పుజారా(38),కోహ్లీ(23)క్రీజులో ఉన్నారు. భారత్ 63 ఓవర్లలో రెండు వికెట్లు కొల్పోయి 153 పరుగులు చేసింది.

mayank

అరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన వారి జాబితాలో మయాంక్‌ కూడా చేరిపోయాడు. ఈ జాబితాలో ఉన్న టీమిండియా ఓపెనర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.అంతకముందు తొలిటెస్టులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో టీమిండియా బ్యాట్స్‌మన్‌ హుస్సేన్‌ ,ఇబ్రహీమ్‌ ,గావస్కర్‌ ,అరుణ్‌ లాల్‌ , శిఖర్‌ ధావన్,పృథ్వీషా ఉన్నారు.

- Advertisement -