మిసైల్‌ మ్యాన్‌గా అనిల్ కపూర్..!

330
anil kapoor
- Advertisement -

మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బయోపిక్ ప్రేక్షకుల ముందుకురాబోతున్న సంగతి తెలిసిందే. అనీల్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో అబ్దుల్ క‌లాం బ‌యోపిక్‌ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో పాత్రల ఎంపికపై ప్రత్యేకదృష్టి సారించిన చిత్రయూనిట్ కలాంగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్‌ని తీసుకోవాలసి భావిస్తున్నారట.

కలాం బయోపిక్‌కి సంబంధించి అనిల్ క‌పూర్‌ని క‌లిసి స్క్రిప్ట్ వినిపించ‌గా, అది ఆయ‌న‌కు ఎంత‌గానో న‌చ్చ‌డంతో అబ్ధుల్ క‌లాం బయోపిక్‌లో న‌టించేందుకు ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. వ‌చ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఎనిమిది సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్లు వేయ‌డం ద్వారా తన మొదటి సంపాదనను ఆర్జించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కలాం పిజిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతర కలాంలో డీఆర్‌డీవో, ఇస్రోలో చేరి ఇండియా మిసైల్ మ్యాన్‌గా ఎదిగారు. ఈ నేపథ్యంలో కలాం బయోపిక్‌ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

- Advertisement -