భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. టీ20, వన్డే సిరీస్‌లలో పాల్గొనే ఆసీస్ జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‌లలో మిచెల్ మార్ష్ సారథ్యంలోనే భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.
వన్డే జట్టులో మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్‌లు రీ ఎంట్రీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది ఆసీస్. వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయిలో జట్టును ఎంపిక చేయగా, టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్లను ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
ఆసీస్ వన్డే జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
ఆసీస్ టీ20 జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్ , ఆడమ్ జంపా
Also Read:ఆర్టీసీ ఛార్జీల పెంపు..BRS ఎమ్మెల్యేల నిరసన

