- Advertisement -
భారత్ – ఆసీస్ మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ చెత్త రికార్డు నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్లో ఓడిపోయిన ఆసీస్ పలు చెత్త రికార్డులను నమోదు చేసింది.
ఈ టెస్ట్ మ్యాచ్ లో ఏ ఒక్క ఆసీస్ బ్యాట్స్ మెన్ కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం ఇదే తొలిసారి. అలాగే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కలిపి 10 మంది ఆసీస్ ఆటగాళ్లు ఎల్బీగా వెనుదిరగడం కూడా ఇదే తొలిసారి. టెస్టుల్లో ఆసీస్ పై ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలవడం ఇది ఐదోసారి.
ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ను మరోసారి ఔట్ చేసిన అశ్విన్ .. ఇప్పటివరకు టెస్టుల్లో అతన్ని 11సార్లు పెవిలియన్కు పంపించాడు. దీంతో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ సరసన అశ్విన్ చేరాడు. బెన్ స్టోక్స్ కూడా వార్నర్ ను 11సార్లు ఔట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -