సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు ఆస్ట్రేలియా ఎన్నారైలు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని కాన్‌బెర్రాలో జరిగిన సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, నేడు ప్రతీ రాష్ట్రం తెలంగాణ మోడల్‌ని కోరుకుంటోందని, కేసీఆర్ నాయకత్వం వల్లే అది సాధ్యమని నమ్ముతున్నారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి చెప్పారు.
కేసీఆర్ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి కూడా సేవలందించి, వారి వెంటే నడవాలని అన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం నూతన జాతీయ పార్టీకి సేవలందింస్తామని, ఏసీటీ కన్వీనర్ రవి సాయల పిలుపునిచ్చారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే సత్తా కేసీఆర్‌కు మాత్రమే ఉందని, మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఆస్ట్రేలియా నుండి టీం ప్రత్యేక కార్యాచరణతో వస్తుందని తెలిపారు.