టీ20లో కంగుతిన్న కంగారులు..కివీస్‌ గెలుపు

400
- Advertisement -

సొంతగడ్డపై జరుగుతున్న పోట్టి ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. సూపర్‌-12లోని గ్రూప్‌-ఏలోని న్యూజిలాండ్‌- ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో 89పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు కివీస్‌ ఓపెనర్లు కాన్వే, అలెన్‌ ల దాటికి ఆసీస్‌ బౌలర్లు నిలబడలేకపోయారు.

కివీస్ నిర్దేశించిన 201 పరుగులను ఛేజ్ చేసే క్రమంలో కివీస్ బౌలర్లు దాటికి ఆసీస్ 111పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఆటగాళ్లు కివీస్‌ బౌలింగ్‌ దాటికి నిలబడలేక వికెట్లను వెంటవెంటనే సమర్పించుకున్నారు. కివీస్‌ బౌలర్లలో శాంట్నర్‌, సౌథీ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంను అందించడంలో కీలకపాత్ర పోషించారు.

- Advertisement -