వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్..47.2 ఓవర్లలో టార్గెట్‌ని చేధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ట్రావిస్ హెడ్ 62,స్టీవ్ స్మిత్ 30,, జోష్ ఇంగ్లిస్ 28 , డేవిడ్ వార్నర్ 29,స్టార్క్ 16 నాటౌట్,కమిన్స్ 14 నాటౌట్ రాణించడంతో ఆసీస్ గెలుపు సాధ్యమైంది.
ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఒకానొక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొనగా డేవిడ్ మిల్లర్ అసమాన సెంచరీతో రాణించాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేయగా హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది దక్షిణాఫ్రికా. ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న మెగా ఫైనల్లో భారత్, ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Also Read:రాములమ్మ ఎఫెక్ట్ : బీజేపీ ‘షట్ డౌన్’!