పోరాడి ఓడిన టీంఇండియా..

222
India vs Australia
- Advertisement -

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీం ఇండియా పోరాడి ఓడింది. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో విరాట్ సేన 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ విజయం లక్ష్యం 17 ఓవర్లకు 174 పరుగులుగా నిర్ణయించారు.

India vs Australia

ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 76), చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) పోరాడినా టీమ్‌కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. కృనాల్ పాండ్యా, దినేష్ కార్తీక్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరడం టీమ్ విజయావకాశాలను దెబ్బ తీసింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ (7), విరాట్ కోహ్లి (4) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, స్టాయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

- Advertisement -