శనివారం మీడియా ముందు తప్పు చేశానంటూ డెవిడ్ వార్నర్ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. వార్నర్ బాల్ ట్యాంపరింగ్ చెయ్యడానికి కారణం తానేనని డెవిడ్ వార్నర్ భార్య, కాండైస్ వార్నర్ ఒప్పుకుంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన కాండైస్ బాల్ ట్యాంపరింగ్ చెయ్యడానికి కారణం తనేని, అది తనను బాధ కలిగిస్తోంని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే.. సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ సమయంలో వార్నర్ భార్య గురించి సఫారీ కీపర్ డికాక్ తప్పుగా మాట్లాడంతో వార్నర్, డికాక్‌లు డ్రెస్సింగ్ రూం మొట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
అయితే వార్నర్ మైదానంలో ఉండగా పలువురు సౌతాఫ్రికా అభిమానులు రగ్బీ ఆటగాడు సోనీ బిల్ విలియమ్స్ మాస్కులు ధరించి అతన్ని రెచ్చగొట్టారని కాండైస్ వార్నర్ తెలిపింది. ఈ నేపథ్యలోనే ఎట్టిపరిస్థితుల్లోనైనా విజయం సాధించాలనే వార్నర్ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. అయినప్పటికీ బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన తన భర్తని సమర్థించడం లేదని, తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలోనే ఈ పని చేశాడని కాండైస్ వార్నర్ చెప్పింది. అంతేకాకుండా అతనిపై ఆస్ట్రేలియా అభిమాలును సానుభూతి, ప్రేమను చూపించాలని కోరింది.