ఆడిలైడ్ టెస్టు…ఆసీస్ 235 ఆలౌట్

199
ind vs aus
- Advertisement -

ఆడిలైడ్ టెస్టులో భారత్ సత్తా చాటింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించడం ఖాయమనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌ మెన్ చేతులేత్తేశారు.

ఓవర్ నైట్ స్కోరు 197 ప‌రుగుల వ‌ద్ద మూడ‌వ రోజు ఆట‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా మ‌రో 38 ప‌రుగులను జోడించి 235 పరుగులకు ఆలౌటైంది.  ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావెస్ హెడ్ అత్య‌ధికంగా 72 ర‌న్స్ చేశాడు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 15 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా, ఆశ్విన్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, ఇశాంత్ శ‌ర్మ‌, ష‌మీలు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇవాళ మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 235 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

- Advertisement -