హాజల్ వుడ్ రాక ఆలస్యం..షాన్ అబాట్‌కు అవకాశం!

3
- Advertisement -

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ టోర్నీ ప్రారంభ దశలో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గాయంతో బాధపడుతున్న హేజిల్‌వుడ్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ కొనసాగించేందుకు సిడ్నీలోనే ఉండనున్నారు.

ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టుకు షాన్ అబాట్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా చేర్చింది. మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్‌లు కొలంబోలో జట్టుతో కలవనున్నారు.

హేజిల్‌వుడ్ విషయానికి వస్తే, హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఆయన ఇప్పటికే యాషెస్ సిరీస్ ప్రారంభానికి దూరమయ్యారు. ఆ గాయం నుంచి కోలుకునే క్రమంలో అకిలీస్ గాయం తిరిగి రావడంతో, ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలోనే చికిత్స కొనసాగించడం ఉత్తమమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నిర్ణయించింది.

Also Read:కేసీఆర్‌ను కలిసిన గూడెం మధుసూదన్

ఆస్ట్రేలియా జట్టు:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, క్యామరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాట్ కూనెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాట్ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా, షాన్ అబాట్ (ట్రావెలింగ్ రిజర్వ్).

- Advertisement -