ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలివే!

194
cinema
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఓటీటీ, థియేటర్‌లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. తాజాగా ఆగస్టు చివరి వారంలో సైతం పలు సినిమాలు ఓటీటీ, థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సుధీర్‌బాబు‌, ఆనంది కీలక పాత్రల్లో కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ లవ్‌స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్‌’.ఆగస్టు 27న థియేటర్‌లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు.. నో పార్కింగ్‌’ అంటూ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకురానుంది. థియేటర్‌లలో ఈ సినిమా విడుదల కానుంది.

ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో రతీంద్రన్‌ ఆర్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూమిక’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 23న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్‌ కథానాయిక. యువ నటుడు సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించగా ఈ చిత్రం ఆగస్టు 27న సోనీలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.

సందీప్‌ కిషన్‌, రెజీనా, హరీశ్‌ కల్యాణ్‌, వెంకట్‌ ప్రభు, విజయ లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘కసడ తపర’. ఆగస్టు 27న సోనీలివ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఆహా వేదికగా ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం ఆగస్టు 27న స్ట్రీమింగ్‌ కానుంది.

- Advertisement -