ఈ స్మృతి దినం ఏక‌త్వ స్పూర్తిని నింపాలి- ప్రధాని మోదీ

141
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగ‌స్టు 14వ తేదీని ఇక నుంచి విభ‌జ‌న స్మృతి దినంగా గుర్తించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఈరోజు ప్ర‌క‌టించారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు.

దేశ విభ‌జ‌న వ‌ల్ల క‌లిగిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేమ‌ని ప్ర‌ధాని చెప్పారు.ల‌క్ష‌లాది మంది మ‌న సోద‌ర‌సోద‌రీమ‌ణులు చెల్లాచెదుర‌య్యార‌ని, మ‌తిలేని ద్వేషం, హింస వ‌ల్ల వేలాది మంది మ‌ర‌ణించార‌ని, వారి క‌ష్టాలు, త్యాగాల‌కు గుర్తుగా ఆగ‌స్టు 14వ తేదీన విభ‌జ‌న భ‌యాన‌క‌ స్మృతి దినంగా పాటించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.

దేశ విభ‌జ‌న వ‌ల్ల ప్ర‌జ‌ల్లో సామాజిక విభ‌జ‌న‌లు వ‌చ్చాయ‌ని, సామ‌ర‌స్యం లోపించింద‌ని, ఆ విష బీజాలను పార‌ద్రోలేందుకు పార్టిష‌న్ హార‌ర్స్ రిమెంబ్రెన్స్ డే నిర్వ‌హించాల‌ని మోదీ తెలిపారు. ఈ స్మృతి దినం ఏక‌త్వ స్పూర్తిని నింపాల‌న్నారు. సామాజిక సామ‌ర‌స్యం, మాన‌వ సాధికార‌త మ‌రింత బలోపేతం కావాల‌ని మోదీ తెలిపారు.

- Advertisement -