ktr:అటుకులు బుక్కిన..అన్నం తిన్న…తెలంగాణ కోసమే.!

49
- Advertisement -

దళితబంధు పథకంతో తెలంగాణలోని దళితుల కళ్లలో ఆనందం చూస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్లా జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌ దళితబంధు ద్వారా ఏర్పాటు చేసుకొన్న రైస్‌మిల్‌ను ఈవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాటి ఉద్యమ స్పూర్తిని ప్రజలకు గుర్తుచేశారు. కేసీఆర్‌ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఉద్యమం సమయంలో అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో ఏం చేసినమో చేసినం గానీ.. మొత్తానికి అనుకున్న లక్ష్యం సాధించేదాక.. ఉద్యమ వ్యతిరేకులుగా ఉన్న కాంగ్రెస్‌, ఆనాడు ఉన్న పార్టీలకు వాటన్నింటికి పోరాటం చేసి ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో విజయ్‌కుమార్‌, డప్పుల లింగయ్య, సుదమల్ల రాజేశ్వరి రూ.30లక్షలతో బ్యాంకు లోను తీసుకొని.. ప్రభుత్వం ద్వారా సబ్సిడీలతో రూ.3కోట్లతో అద్భుతమైన రైస్‌మిల్‌ను కట్టి ఇవాళ నాతోని ప్రారంభింపజేశారు. సంతోషం ఎక్కడ అనిపించిందంటే ఆ రైస్‌ మిల్‌కు నేనే భూమిపూజ చేశాను. ఇవాళ ప్రారంభోత్సవం చేసే అదృష్టం, భాగ్యంనాకే దక్కింది. అక్కడకుపోయి చూసి కండ్లకు నీళ్లచ్చినయ్‌. గుండె సంతోషంతో నిండిపోయింది. రైస్‌మిల్‌ను ప్రారంభించే సమయంలో బిహార్‌ యువకుడు కనిపించాడు. ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగితే రైస్‌ మిల్‌ ప్రారంభంతో ఇక్కడకు 12 మంది బిహార్‌నుంచి వచ్చారని చెప్పాడు.

12 మంది బిహార్‌ నుంచి వచ్చి పని చేసుకుంటున్నాం. నేను ఆపరేటర్‌ పని చేసుకుంటున్న. నా కింద హమాలీలు, ఇతర సిబ్బంది 12 మంది పని చేస్తున్నారని ఆ తమ్ముడు చెబితే.. ఇవాళ తెలంగాణ.. రాష్ట్ర బిడ్డలకు బువ్వపెట్టుడు కాదు ఎక్కడో ఉండే.. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ బిడ్డలను కడుపులో పెట్టుకొని బువ్వపెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పదవులు మస్త్‌గా వస్తయ్‌.. పోతయ్‌. కానీ, వెనక్కి మళ్లి చూస్తే పదవులు ఉన్నప్పుడు ఏం చేశావంటే.. వెనక్కి తిరిగి గల్లా ఎగురవేసి ఇగో ఇది నేను చేసిన అని చెప్పే సత్తా కేసీఆర్‌ నాయకత్వంలో పని చేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు మీకు మాత్రమే ఉందన్నారు.

తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డులకు నేను సలామ్‌ కొడుతున్న. ఎందుకుంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నరు. ఒకరితో ఒకరు పోటీపడి గంగదేవిపల్లి, అంకాపూర్‌ను మేం ఎందుకు సృష్టించొద్దని పోటీపడుతున్నరు. పంచాయతీ సెక్రెటరీల నుంచి జిల్లా అధికారుల వరకు అందరూ మీకు సహాయం అందిస్తున్నరు. దేశంలో బెస్ట్‌ మున్సిపాలిటీలు ఎక్కడున్నయ్‌ అని లెక్క తీస్తే 142లో 27 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయి. ఇది సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి పనితీరు, ఫలితం కాదా? కౌన్సిలర్లు బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడనే కాదు రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా పనులు పట్టణ ప్రగతి పనులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో మీరు అష్టకష్టాలు పడి పని చేస్తే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయంటూ అభినందించారు.

ఇవి కూడా చదవండి…

Janga Raghavareddy:జంగాపై సస్పెన్షన్ వేటు

CM KCR:ఫడ్నవీస్‌కు సీఎం కేసీఆర్ సవాల్

savarkar:రాహుల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఉద్ధవ్..!

- Advertisement -