మోహన్ బాబుకు షాక్‌..హత్యాయత్నం కేసు నమోదు

3
- Advertisement -

నటుడు మోహన్ బాబుకు షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నంగా మారుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు.

మంచు మనోజ్‌పై దాడి కేసులో విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం తనపై దాడి చేశారని నటుడు మనోజ్‌ పహడీషరీఫ్ పోలీసులకు కంప్లైంట్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. మరోవైపు మోహన్ బాబుకు సీపీ జారీ చేసిన నోటీసులు, విచారణకు హాజరయ్యేందుకు న్యాయస్థానం ఈ నెల 24 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:ఈ వివాదానికి కారణం వినయ్‌: మనోజ్

- Advertisement -