సల్మాన్‌ ను చంపడానికేనా..?

184
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ జింకను చంపాడన్న కారణంగా కొన్నేళ్ల క్రితం సల్మాన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై గత వారం సల్మాన్‌ జోధ్‌పూర్‌ న్యాయస్థానానికి కూడా వెళ్లి వచ్చారు.

అయితే సల్మాన్‌ను చంపడానికి కొందరు దుండగులు ‘రేస్‌ 3’ సెట్స్‌లోకి చొరబడ్డారని సమాచారం. రాజస్థాన్‌కి చెందిన లారెన్స్‌ బిష్నోయ్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ నుంచి సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

  Attack on Salman Khan and shooting of Race 3 stopped

ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.. ముంబైలో ఫిల్మ్ సిటీలో మంగళవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతండగా, గుర్తుతెలియని సాయుధులైన వ్యక్తులు అక్కడకొచ్చారని, చిత్రయూనిట్ ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేసిందని ఆ పత్రిక కథనం. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు షూటింగ్ ని తక్షణం నిలిపివేయాలని సల్మాన్ కి, చిత్ర నిర్మాత రమేష్ తౌరానికి చెప్పారని వెంటనే అక్కడి నుంచి తమ నివాసాలకు వెళ్లిపోవాలని వాళ్లిద్దరికీ పోలీసులు సూచించారని తెలిపింది.

దీంతో ఆరుగురు పోలీసుల రక్షణలో సల్మాన్ తన వాహనంలో ఇంటికి చేరుకున్నట్టు ఆ పత్రిక కథనం ఇచ్చింది. కాగా, ఈ విషయమై ముంబై పోలీసులు మాట్లాడుతూ, సల్మాన్ కు బెదిరింపులు రావడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పారు.‘రేస్ 3’ సెట్స్ వద్ద మరింత భద్రత కల్పిస్తున్నట్టు చెప్పారు. ముగ్గురు వ్యక్తులు సల్మాన్ ని చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లొకేషన్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారని తెలిపారు.

- Advertisement -