Donald Trump:ట్రంప్‌పై హత్యాయత్నం..

18
- Advertisement -

అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం సంచలనంగా మారింది.పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌ కుడి చెవికి గాయమైంది.

అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనకు పాల్పడిన దుండగుడిని కాల్పిచంపేశారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

ఇక దాడికి పాల్పడిన దుండగుడిని బెథెల్‌ పార్క్‌కు చెందిన థామస్‌ మాథ్యూ క్రూక్స్‌(20)గా పోలీసులు గుర్తించారు. దుండగుడు సభా ప్రాంగణంలోకి తుపాకీని ఎలా తీసుకెళ్లగలిగాడు అన్నదానిపై విచారణ చేపట్టనున్నారు. మన దేశంలో ఇలాంటి ఘటన జరగడాన్ని నమ్మలేకపోతున్నా… నన్ను కాల్చిన ఒక బుల్లెట్‌ నా కుడి చెవి పైభాగాన్ని తాకింది. బుల్లెట్‌ శబ్ధం విని ఏదో జరుగుతున్నది అని అనుకుంటుండగానే నాకు బుల్లెట్‌ తగిలిందని చెప్పారు ట్రంప్. తీ ఊహించని పరిణామం నుంచి ఆ దేవుడే కాపాడాడు. ఈ సమయంలో అమెరికన్లు ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మరోవైపు ట్రంప్ పై దాడిని ఖండించారు బైడెన్. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని, దేశమంతా ఐక్యంగా ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు.

ALso Read:KTR:రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే?

- Advertisement -