నిరుద్యోగులు ,విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పి తీరాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఏ పరీక్ష రాస్తున్నాడని రేవంత్ రెడ్డి దీక్ష చేశాడు? అని ప్రశ్నించారు. ఏ పరీక్ష రాస్తున్నాడని రాహుల్ గాంధీ అశోక్‌నగర్‌కు వచ్చాడు?,అశోక్‌నగర్‌లో ఉండే సన్నాసులు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు..మీ రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చిండు.. నువ్వు వచ్చినవ్.. మీ నాయకులు అందరూ ఆ కోచింగ్ సెంటర్ల చుట్టే తిరిగారు.. ఎవరు సన్నాసులు? ,నిరుద్యోగులకు సమాధానం చెప్పే సత్తా లేక నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదు అన్నారు.
నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా దివాళాకోరుతనంతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు..అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను అవమానించేలా మాట్లాడుతున్నాడు…అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుందన్నారు.
ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, లక్షలాదిమంది తెలంగాణ యువతకు సంబంధించిన అంశం…రేవంత్ రెడ్డి ఈగోకి, బేషజాలకు పోకుండా, కండకావరంతో మాట్లాడడం ఆపాలిన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఒకాయన ముఖ్యమంత్రి అయితే.. మరొకాయన జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు.. కానీ తెలంగాణలో నిరుద్యోగులకు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలకు అతి గతి లేదు అని ఎద్దేవా చేశారు.
Also Read:శశి మధనం…సక్సెస్ మీట్

