వీధి కుక్కలను షెల్టర్లకు తరలిస్తున్నారనే కోపంతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి పాల్పడినట్లు గుజరాత్‌కు చెందిన సకారియా జాతీయ మీడియాకు వెల్లడించారు. నిన్న ఉదయం జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జుట్టు పీకి, చెంపపై కొట్టారు సకారియా.
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని రేఖా గుప్తా చెప్పడంతో కోపంతో కొట్టాడని జాతీయ మీడియా సమాచారం. వీధి కుక్కలంటే తనకు ప్రేమ అని, వాటి సమస్యను తెలిపితే సీఎం పట్టించుకోలేదని అందుకే దాడి చేశానని.. గుజరాత్ నుండి ఢిల్లీకి ట్రైన్లో వచ్చానని జాతీయ మీడియాకు సకారియా తెలిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్త తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చి, వినతిపత్రం ఇచ్చి గట్టిగా అరుస్తూ సీఎం చెంపపై కొట్టి, జుట్టు పీకి దాడి చేకి పాల్పడ్డాడు సకారియా. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read:పాము బర్త్ డే..యువకుడి అరెస్ట్

