ఏటీఎం చార్జీల పెంపుకు రంగం సిద్ధం?

245
atms
- Advertisement -

బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్‌. ఏటీఏం ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. దీంతో ఇకపై ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటివి మరింత భారం కావొచ్చు. ఏటీఎం ఆపరేటర్ల అసోసియేషన్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు లేఖ రాసింది. క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేట్లు కేంద్ర బ్యాంక్‌ను కోరారు.

ఇటీవలె రిజర్వు బ్యాంక్ ఏటీఎంల సెక్యూరిటీ, మెయింటెనెన్స్ నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రమాణాలను కూడా తీసుకువచ్చింది. దీంతో ఆపరేటర్లకు ఏటీఎం నిర్వహణ భారమైంది. దీంతో ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని ఆపరేటర్లకు లేఖ రాశారు. ఆర్‌బీఐ కూడా వీరి లేఖకు సానుకూలముంగా స్పందించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో.. అంటే 10 లక్షలలోపు జనాభా ఉన్న చోట్ల ఇంటర్‌ఛేంజ్ ఫీజులను రూ.18గా నిర్ణయించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇది వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.8 ఫీజు వసూలు చేయాలని సూచించింది.

ఆరుగురు సభ్యుల కమిటీ కేవలం ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంపును మాత్రమే కాకుండా ఏటీఎం లావాదేవీలపై కూడా పలు సిఫార్సులు చేసింది. ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను తగ్గించాని రికమెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్రీ ట్రాన్సాక్షన్లను మూడుకు పరిమితం చేయాలని సూచించింది. దీంతో కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది.

- Advertisement -