దీపికాపై అట్లీ ప్రశంసలు!

5
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేపై ప్రశంసలు గుప్పించారు దర్శకుడు అట్లీ. ప్రస్తుతం AA22 అనే తాత్కాలిక టైటిల్‌తో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, దీపికా పదుకొణే కథానాయికగా కనిపించనుంది.

ఇటీవల వరల్డ్ పికిల్‌బాల్ లీగ్ (WPL) మ్యాచ్ సందర్భంగా ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన అట్లీ, AA22 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీపికా పదుకొణే తనకు లక్కీ చార్మ్ అని పేర్కొన్న ఆయన, ఆమెతో ఇది తన రెండో సినిమా అని తెలిపారు. ఈ చిత్రంలో దీపికా పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనుండగా, ఆమె పాత్ర అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని అట్లీ వెల్లడించారు.

Also Read:విమాన ప్రమాదాలు..మృతి చెందిన నేతలు వీరే!

తాను తన టీమ్‌తో కలిసి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ ప్రాజెక్ట్‌పై కష్టపడుతున్నామని చెప్పారు. కాస్త వేచిచూడండి. మీరు ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు అని అట్లీ అన్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్‌కు చెందినదిగా ఉండబోతుందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముందని చిత్రబృందం చెబుతోంది.

- Advertisement -