బన్నీ కోసం అట్లీ ఏం చేస్తున్నాడో తెలుసా?

9
- Advertisement -

పుష్ప 2 తర్వాత బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మూవీకి సంబంధించిన రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

బన్నీ పాత్రలో మూడు కోణాలు ఉంటాయని, పైగా బన్నీ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని వార్తలు రాగా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. జైలర్ సినిమాలో శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్ కనిపించినట్లుగానే బన్నీ సినిమాలోనూ రెండు పవర్‌ఫుల్ గెస్ట్ రోల్స్‌ని డిజైన్ చేశారని తెలుస్తోంది.

ఓ గెస్ట్ రోల్‌లో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడని తెలుస్తోండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.

Also Read:BRS:రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధం

- Advertisement -