అత్యంత సంపన్న నగరాల జాబితాలో మన హైదరాబాద్‌..

37
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలోకి హైదరాబాద్‌ చేరింది. తాజాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాను హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ వెల్లడించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 97పట్టణాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో మన హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. నగరంలో మొత్తంగా 11,100మంది మిలియనీర్లు ఉన్నట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు.

Also read: ‘ది ఆంటోరా స్టోర్’ను ప్రారంభించిన లక్ష్మీ మంచు

2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్లో అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78శాతం పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. మొదటి స్థానంలో న్యూయార్క్‌ సిటీ 3,40,000మంది మిలియనీర్లతో ఉందని వెల్లడించింది. జపాన్ రాజధాని టోక్యో 2,90,300మంది మిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాన్‌ఫ్రాన్సిస్కో బే, లండన్, సింగపూర్, లాస్ ఏంజెల్స్‌, హాంకాంగ్, బీజింగ్‌, షాంఘై, సిడ్నీ తొలి పది స్థానాల్లో ఉన్నాయి.

Also read: ఈ చిట్కాలు పాటించండి..మీ ఆరోగ్యం పదిలం

భారత్ నుంచి 59,400మంది మిలియనీర్లతో ముంబాయి 21వ స్థానం దక్కించుకుంది. తర్వాత ఢిల్లీ 30,200మిలియనీర్లతో 36వ స్థానం, బెంగళూరు 12,600మంది మిలియనీర్లతో 60వ స్థానం, కోల్‌కతా 12,100మందితో 63వ స్థానం తదుపరి మన హైదరాబాద్ నిలిచింది. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంపన్న నగరాలను ఆఫ్రికా ఆస్ట్రేలియాసియా సీఐఎస్ తూర్పు ఆసియా ఐరోపా మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికా దక్షిణాసియా ఆగ్నేయాసియా ఇలా వివిధ ప్రాంతాలుగా విభజించి జాబితాను రూపొందించినట్టుగా నివేదికలో వెల్లడించింది.

- Advertisement -